క్రైమ్/లీగల్

దొంగగా మారిన టెన్నిస్ కోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మే 15: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న టెన్నిస్ కోచ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ(24) శాతావాహననగర్‌లో మూడేళ్లుగా నివాసం ఉంటూ టెన్నిస్ కోచ్‌గా పని చేస్తున్నాడు. చెడు అలవాట్లకులోనై వచ్చే డబ్బు సరిపోకపోవడంతో సులువుగా డ బ్బు సంపాదించాలని కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలలో పిల్లలకు టెన్నిస్ కోచింగ్ ఇస్తానని చెప్పి రోజు వారి ఇళ్లలోకి వెళ్లి కోచింగ్ ఇస్తూ సన్నిహితంగా ఉండి నమ్మకం ఏర్పరుచుకుని ఇంటి యజమానులు లేని సమయంలో నకిలీ తాళం చెవులతో తాళాలు తీసి చోరీలకు పాల్పడుతూ తప్పించుక తిరుగుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పట్టకుని కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదకొండున్నర తులాల బంగారం, రెండున్నర కేజీల వెండి, ద్విచక్ర వాహనాన్ని, మిక్సీ, ఎల్‌ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి డీసీపీ వెంకటేశ్వర్ రావు రివార్డును ప్రకటించారు.