క్రైమ్/లీగల్

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ చౌదరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ బుధవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం విధితమే. ఫోర్జరీ, డాటా చౌర్యం కేసుల ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఇప్పటికే ఆయనకు సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు స్పందించని రవిప్రకాశ్ ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో ప్రయత్నించారు.