క్రైమ్/లీగల్

రాజా నియామకంపై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 15: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం చెల్లదంటూ హైకోర్టులో బుధవారం జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌లో పిటిషనర్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్ 3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు వాదించారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. సేవాదృక్పథం, ఙ్ఞన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ దీనిపై అదేరోజు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాఉంటే సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.