క్రైమ్/లీగల్

బీజేపీ కార్యకర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 25: మహారాష్టల్రోని అకోలా జిల్లాకు చెందిన బీజేపీ మైనారిటీ సెల్ కార్యకర్త మతిన్ పటేల్ (48) దారుణ హత్యకు గురైనట్లు శనివారం పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మొహాల్ల గ్రామంలో, అకోలా జిల్లాకు 508 కిలో మీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మతిన్‌కు తన కమ్యూనిటీకి చెందిన కొంతమందితో వివాదం జరిగింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి చెందినవారు 8 నుంచి 10 మంది వరకు పటేల్‌పై ఇనుపరాడ్లు, కట్టెలతో దాడి చేయడంతోనే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో 55 ఏళ్ల మతిన్ పటేల్ సోదరుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 10మందిపై కేసు నమోదు చేసినట్లు , అందులో కాంగ్రెస్ పార్టీకీ చెందిన హిదాయత్‌పటేల్ కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మతిన్ హత్యతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది.