క్రైమ్/లీగల్

కిడ్నీ మార్పిడి కేంద్రం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: విశాఖలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేంద్రం శ్రద్ధ ఆసుపత్రిని అధికారులు శనివారం సీజ్ చేశారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనలపై నమోదైన కేసుతో ఆసుపత్రిలో చోటుచేసుకున్న అవకతవకలపై యంత్రాంగం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఇప్పటికే పలు సార్లు ఆసుపత్రిని సందర్శించి రికార్డులు పరిశీలించడంతో పాటు బాధితులు, రోగులను ప్రశ్నించిన కమిటీ వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టు కమిటీ నిర్ధారించింది. దీనికి సంబంధించి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించే వైద్యుడు, బెంగళూరుకు చెందిన మధ్యవర్తి, ఆసుపత్రి ఉన్నతాధికారిని అరెస్టు చేసిన పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం ఆచూకీ కోసం గాలిస్తోంది. తాజాగా కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లా వైద్యఆరోగ్య అధికారితో పాటు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సీజ్ చేశారు.