క్రైమ్/లీగల్

ఎండ తీవ్రతకు కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ, మే 25: ఎండ తీవ్రతకు కారు తగులబడింది. అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ సురేష్, తన మిత్రులతో కలిసి మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకుని తిరిగి కారులో బెంగళూరుకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు పత్తికొండ మండలం మండగిరి గ్రామ సమీపంలోకి రాగానే ఎండ తీవ్రతకు కారు వెనుక భాగం నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన వాహనదారులు కారులోనివారిని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన సురేష్, అతని స్నేహితులు కారును ఆపి బయటకు పరుగులు తీశారు. ఆ వెంటనే మంటలు తీవ్రమై కారు పూర్తిగా కాలిపోయింది. ఎండ వేడికి కారులో మంటలు వ్యాపించి తగులబడి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.