క్రైమ్/లీగల్

దర్యాప్తునకు మేం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: కోట్లాది రూపాయల బిట్‌కాయిన్ పోంజీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. బిట్‌కాయిన్ పోంజీ సంస్థ భారీ రిటర్నులు అందిస్తామంటూ భరోసా ఇచ్చి ఎంతోమంది పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తి బెయిల్ కోసం దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్ జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఏ.ఎస్.బొపన్నతో కూడిన వెకేషన్ బెంచ్ దృష్టికి వచ్చింది. ఇదే వ్యక్తి పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులపై సీబీఐ దర్యాప్తునకు యోచిస్తోంది. ఇదే కుంభకోణంపై తమ సంస్థ ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి తమ సంసిద్ధతను సుప్రీంకు తెలియజేసింది. బిట్‌కాయిన్ సంస్థ న్యాయపరంగా ఏర్పడినది కాదు, అంతేకాకుండా ఇది కనీసం మధ్యస్థస్థాయి ఎక్స్ఛేంజిలోనైనా నమోదు కాలేదు. ఇదిలావుండగా, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ బిట్‌కాయిన్ పోంజి సంస్థ పాల్పడిన కుంభకోణం చాలా పెద్దదని, కోట్లాది రూపాయల స్కాం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంస్థ వల్ల మోసపోయిన ఎంతోమంది పెట్టుబడిదారులు వివిధ రాష్ట్రాల్లో న్యాయం కోసం పోలీసులను, కోర్టులను ఆశ్రయించడంతో సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ ముందుకు వచ్చిందని ఆయన కోర్టుకు వివరించారు. ఈ సంస్థకు చెందిన ఒక వ్యక్తి అరెస్టయి, ప్రస్తుతం సీబీఐ విచారణకు తాను సిద్ధమేనని అంటుండడంతో అందుకు విచారణకు సీబీఐ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్న విషయాన్ని సొవిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుని తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ పిటిషన్‌దారునికి కొన్ని కేసుల్లో బెయిల్ లభించిందని, ఇంకా మరో మూడు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరైందని, తమ పిటిషనర్ ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు.