క్రైమ్/లీగల్

రూ. 25 లక్షలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది మురుగు ప్రక్షాళనపై కొనసాగుతున్న నిర్లక్ష్య వైఖరిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక్కో రాష్ట్రం 25 లక్షల జరిమానా చెల్లించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. గంగానది మురుగు ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం ఒక్కటి కూడా పూర్తి చేయలేదని పేర్కొంది. అలాగే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 22 ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం మూడుచోట్ల మాత్రమే పూర్తి చేసింది. ఇక జార్ఖండ్‌లో ఏ ఒక్క ప్రాజెక్టు సంతృప్తికరంగా లేదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ మూడు రాష్ట్రాలు ఎన్‌జీటీ ప్రతిపాదనల అమలులో నిర్లక్ష్యం చేయడం శోచనీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం వహించడంలో భాగంగా ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర పరిహారం కింద ఒక్కో రాష్ట్రం నుంచి 25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించామని ఎన్‌జీటీ పేర్కొంది. నెలలోగా పనులను పూర్తి చేయాలని కూడా ఆయా రాష్ట్రాలను ఆదేవించింది. గంగా నదిని పారిశ్రామిక వ్యర్థాలతో పాక్షికంగా కలుషితం చేయడాన్ని కూడా క్రిమినల్ చర్యగా భావిస్తున్నామని యూపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే, గంగానదీ పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా కాలుష్యం జరగకుండా స్వయంగా చూసే బాధ్యత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఉందని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనిపై ఆగస్టు ఏడో తేదీలోగా అఫిడవిట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆదేశించింది.