క్రైమ్/లీగల్

నదుల అనుసంధానం ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకూ గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టిందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఎన్జీటీలో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం నదులు అనుసంధాన కార్యక్రమానికి పర్యవరణ అనుమతులు అవసరమని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నంచి ఎలాంటి నివేదిక అందలేదని, అయితే ఈ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలంటూ దాని ప్రాంతీయ కార్యాలయానికి లేఖ మాత్రమే రాసినట్టు తెలిపిందని ట్రిబ్యునల్ పేర్కొంది. కాలుష్య నియంత్రణ, నిర్మూలన చట్టం-1974, కాలుష్య నియంత్రణ నిర్మూలన చట్టం 1981లో అంశాల ప్రకారం నదుల అనుసంధానికి ఎలాంటి అనుమతులుగాని, ఆదేశాలు కాని లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చే వరకూ పనులు నిలుపుదల చేయాలని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని తెలిసి కూడా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తన పాత్ర సరైన విధంగా పోషించలేదని ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కారణాలు మూలంగా ఈ నదుల అనుసంధాన కార్యక్రమానికి అనుమతులు వచ్చేంతా వరకు పనులు ఆపాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నదుల అనుసంధాన కార్యక్రమం స్థితిగతులు చెన్నైలోని కేంద్ర అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో కలిసి తనిఖీలు చేపట్టి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.