క్రైమ్/లీగల్

ఇరువురు విద్యార్థుల ప్రాణం తీసిన దాగుడు మూతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూన్ 1: దాగుడుమూతలు ఆడుతూ తోటి వారికి కనిపించకుండా పెట్టెలో దాక్కున్న ఇరువురు బాలల ఊపిరాడక మరణించిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జరిగి వారం రోజులైన తరువాత శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జడ్డంగి పంచాయతీ చిన్నయ్యపాలెం గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత్‌కుమార్ (11), లబ్బర్తి పంచాయతీ నెల్లిమెట్ల గ్రామానికి చెందిన చెడెం కార్తీక్ (9) ఈ సంఘటనలో మరణించారు. అడ్డతీగల మండలం మట్లపాడుకు చెందిన ప్రశాంత్‌కుమార్ చిన్నతనంలో తల్లి చనిపోవడంతో చిన్నయ్యపాలెం అమ్మమ్మ తెడ్ల లక్ష్మి ఇంటి వద్ద ఉంటూ జడ్డంగి ప్రాథమిక పాఠశాలలో అయిదవ తరగతి చదువుతున్నాడు. నెల్లిమెట్ల ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న కార్తీక్ వేసవి సెలవులను గడిపేందుకు నానమ్మ ఇంటికి వచ్చాడు. కాగా చిన్నయ్యపాలెం నుండి సమీపంలో ఉన్న జడ్డంగి గ్రామానికి గతనెల 25న జరిగిన బంధువుల శుభకార్యానికి కుటుంబ సభ్యులతోపాటు ఈ బాలలు కూడా వెళ్లారు. భోజనాలు అనంతరం పెద్దలంతా చిన్నయ్యపాలెం చేరుకోగా ఈ బాలలు మాత్రం ఇళ్లకు రాలేదు. తోటి బాలలతో చిన్నయ్యపాలెం గ్రామంలో దాగుడు మూతలు ఆటలు ఆడుతూ ఎవ్వరికీ కనిపించకుండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న పాత పాఠశాల భవనంలోకి వెళ్లారు. గతంలో పాఠశాల రికార్డులు భద్రపరిచేందుకు పెద్ద చెక్క పెట్టెలోకి దాక్కున్నారు. పెట్టె గొళ్లెం పడిపోవడంతో పెట్టె తెరుచుకోకపోడంతో ఊపిరాకడక మరణించారు. శనివారం బాలలంతా పాఠశాల సమీపంలో క్రికెట్ ఆడుతుండగా బంతి పాడుబడిన పాఠశాల భవనంలో కిటికీలోంచి దూసుకెళ్లి పడింది. ఆ బంతిని తీసేందుకు బాలలు వెళ్లడంతో గది అంతా తీవ్ర దుర్గంధంతో నిండిపోయింది. చెక్క పెట్టె నుండి నీరుకారడంతో అనుమానం వచ్చి పెద్దలకు తెలియజేశారు. వారు వెంటనే వచ్చి పెట్టె తెరిచి చూడగా ఇరువురు బాలల మృతదేహాలు పురుగులుపట్టి, శిథిలమైపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. వెంటనే పోలీసులకు తెలియజేయడంతో సీఐ బి రాజారావు, రాజవొమ్మంగి ఎస్సై బి వినోద్, తహసీల్దార్ కె శ్రీనివాస్‌లు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన విద్యార్థులు కనిపించకుండపోయిన వెంటనే జడ్డంగి పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. కనిపించకపోడంతో ఈనెల 26న జడ్డంగి పోలీస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని భావించారు తప్ప తమ గ్రామంలోనే మరణించి ఉంటారని తెలుసుకోలేకపోయామని కార్తీక్ తల్లిదండ్రులు భవానీ, కన్నయ్యలు, ప్రశాంత్‌కుమార్ అమ్మమ్మ లక్ష్మిలు బోరున విలపించసాగారు. ఈ కుటుంబాలతో వివాదాలు ఉన్న వారు, కిట్టని వారు బాలలను హతమార్చి పెట్టెలో పెట్టి ఉండవచ్చని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ రాజారావు తెలిపారు. మృతదేహాలు తరలించడానికి వీలులేకపోడంతో అడ్డతీగల పీహెచ్‌సీ వైద్యులు శ్రీదుర్గ సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిత్రం... పెట్టెలో పాడైపోయిన బాలల మృతదేహాలు