క్రైమ్/లీగల్

ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, పాడేరు: విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీలో ఆదివారం సాయంత్రం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో తెగిపడిన విద్యుత్ వైర్లకు ఐదుగురు దుర్మరణం చెందగా, చిన్న పిల్లలతోపాటు పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం చెరువూరు, పెద్దపల్లి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంతకు వెళ్ళారు. ఆటోలో ఆ రెండు గ్రామాల గిరిజనులు తిరుగు ప్రయాణం కాగా, చెరువూరు సమీపంలో ప్రమాదవశాత్తు కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో వైర్లు ఆటోపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు పాక్షికంగా సజీవ దహనమై మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు చెరువూరు గ్రామానికి చెందిన వంతల చిట్టిబాబు(55), వంచురోబ గంగరాజు(37), లోత బుజ్జిబాబు(30), వంతల కృష్ణారావు(25), పెద్దపల్లి గ్రామానికి చెందిన జనుకూరు ప్రసాద్(20) మృతి చెందారు. ఈ ప్రమాదంలో వంచురోబ చిన్నబ్బాయి(45), వంతల రామ్మూర్తి(40), లోత వరలక్ష్మి(27), బాతూని జాన్‌బాబు(2), బెజ్జంగి దావీద్(2), జనుగూరు వివేక్(1)లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులను రక్షించే ప్రయత్నం సమీపంలోని వారు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కరెంట్ సరఫరా అవుతుండడంతో దూరం నుండే ఇసుక, మట్టి పోసినప్పటికీ మంటలు ఆరకపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో చెరువూరు, పెద్దపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది. గాయపడిన వారిని లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
సీఎం సంతాపం
విజయవాడ: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరులో ఆదివారం జరిగిన ఆటో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో ఘటనలో మృతి చెందిన ఆటో ప్రయాణికులు