క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్/వికారాబాద్, ఫిబ్రవరి 9: శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో లారీ ఢీకొని వికారాబాద్ జిల్లాకు చెందిన శివమాల ధారణ స్వాములు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మధు (18), గుండెపల్లికి చెం దిన చంద్రప్ప(19) వ్యవసాయం చే స్తూ జీవనం సాగిస్తుంటారు. శివమాల ధారణ చేసి గత 40 రోజులుగా దీక్ష చేసిన వీరిద్దరు శివరాత్రి సమీపించడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ద్విచక్రవాహనం పై బయలుదేరారు. శుక్రవారం సా యంత్రం దోర్నాల్ గ్రామం శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో గ్యాస్ సిలిండర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఇంజనీరింగ్ విద్యార్థి ..
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరిగుట్ట ఆల్విన్‌కాలనీకి చెంది న సాయికుమార్ (20), కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్‌కు చెందిన సూర్యసేన్(20) మండలంలోని సీఎంఆర్ (ఐటీ) కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయం త్రం కళాశాల ముగిసిన తరువాత ద్విచక్రవాహనంపై ఇరువురు ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు గుండా గడిమైసమ్మ వైపు వెళ్లేందుకు కాలేజీ నుంచి జా తీయ రహదారిపై నుంచి ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు వైపుకు వస్తుండగా ఎదరుగా వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించగా అతను చికిత్స పొం దుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మరో విద్యార్థి సూర్యసేన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.