క్రైమ్/లీగల్

చిత్తూరు జిల్లాలో తనయుల దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 4: తనకు జన్మనిచ్చిన తండ్రి పట్ల ప్రేమ, దయ, బాధ్యతతో వ్యవహరించాల్సిన ఓ కొడుకు మానవత్వం మరచి భార్య, బావమరిదితో కలిసి కళ్లల్లో కారంపొడి చల్లి, ఇనుప రాడ్‌తో దాడి చేసిన సంఘటన మంగళవారం తిరుపతిలో జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అనంత వీధిలోని మునికిష్టయ్య (88)పై ఆయన పెద్ద కొడుకు విజయ్, భార్య, బంధువులతోకలిసి దాడి చేశాడు. తాము కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులను తీర్చడానికి రెండు సెంట్ల భూమిని అమ్మడానికి ప్రయత్నించడమే కొడుకు విజయ్ ఆగ్రహానికి కారణమైయ్యింది. దీంతో విచక్షణ కోల్పోయి తన తండ్రిపై ఉన్మాదిలా దాడి చేశాడు. ఇందుకు భార్య, బావమరిది కూడా సహకరించారు. వృద్దుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు జోక్యం చేసుకుని మునికిష్టయ్యను రక్షించి రుయాకు తరలించారు. పండు ముసలివాడైన తండ్రిపట్ల కొడుకు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొడుకు, కోడలు ఇతరులు కలిసి తనపై దాడి చేశారని బాదితుడు మునికిష్టయ్య వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదిలావుండగా కన్నతల్లిపై కుమారుడి దాష్టీకం చేసిన సంఘటన చంద్రగిరిలో జరిగింది. ఇంట్లో ఉండవద్దంటూ మూడునెలలుగా వేధించడంతో చేసేదిలేక తల్లి అధికారులను కలసి తన గోడును విన్నవించుకుంది. చంద్రగిరి మండలం దోర్నకంబాలలో కృష్ణారెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 1993లో భర్త చనిపోయాడు. కొంతకాలానికి కుమారుడికి పెళ్లిచేసింది. పెళ్లయిన తర్వాత మునిరత్నం వేరుకాపురం పెట్టి తల్లిని చూడడం మానేశాడు. దీంతో నారాయణమ్మ కుమార్తెల వద్ద తలదాచుకుంటోంది. ఇదిలావుండగా కొంతకాలానికి మామగారి ఆస్తుల్లో కొంత వాటా రమణమ్మకు లభించింది. ఈ స్ధలంలో కుమార్తెలు ఆమెకు ఇల్లుకట్టించి ఇచ్చారు. అయితే ఆమెకు తెలియకుండా ఇంటికి పన్ను చెల్లించి వాటి ఆధారంగా ఆ ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ ఇల్లు తనదని, ఇంటిలోనుంచి వెళ్లిపొమ్మని తల్లిని వేధించసాగాడు. దీంతో చేసేదిలేక తల్లి మంగళవారం అధికారులను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకుంది.