క్రైమ్/లీగల్

కారు కాదు.. మృత్యు శకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకోల (మహారాష్ట్ర), జూన్ 5: భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక నీడ కోసమో లేక కారులో కూర్చుని సేద తీరుదామని అనుకున్నాడేమో కానీ ఆ పనె్నండేళ్ళ బాలుడి పట్ల అది మృత్యుశకటంగా మారింది. మహారాష్ట్ర, అకోల జిల్లాలోని ఆలేవాడి గ్రామంలో ఈ హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ఒక కారు సాంకేతికంగా దెబ్బతిని రెండేళ్ళుగా మూలపడింది. మృతుడు తనీష్ బల్లాల్ తన నాయనమ్మతో కలిసి వృథాగా ఉన్న ప్లాస్టిక్ సంచులను ఏరుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సమయంలో వేసవి తీవ్రతతో బల్లాల్ అక్కడ పార్కు చేసి ఉన్న కారు డోరు తీసి లోపల కూర్చున్నాడు. విధి వక్రించి ఆ కారు డోరు లాక్ అయ్యింది. లాక్ అయిన డోర్‌ను తీసుకోవడం తెలియని బల్లాల్ అందులో ఊపిరాడక మృత్యువాతపడ్డాడు. బల్లాల్ కారు ఎక్కుతున్నది నాయనమ్మ గమనించలేదు. సాయంత్రమైనా మనవడి జాడ లేకపోవడంతో తల్లడిల్లిన నాయనమ్మ ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. తన ఇంటికి సమీపంలోనే కారును పార్కు చేసిన యజమాని వచ్చి డోర్ తీయగా ఒక బాలుడు విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించాడు. ఈ విషయాన్ని యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. జరిగిన ఘటనతో ఆ బాలుడి నాయనమ్మ కన్నీటీపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.