క్రైమ్/లీగల్

అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 5: యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామంతాపూర్ భరత్‌నగర్‌లో నివసిస్తున్న దూదేకుల ఖాసీం ఫీరా (32) మెడికల్ కోడ్ బిజినెస్ చేస్తున్నాడు. అతడు విజయవాడకు చెందిన కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 3వ తేదీన కిచెన్ ఐటమ్స్ తీసుకరావడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాక అదృశ్యమయ్యాడు. అతని కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా జాడ దొరకలేదు. బావమరిది సమ్మెట వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఎస్‌ఐ జయరాం తెలిపారు.