క్రైమ్/లీగల్

ఏలేరు కాలువలో దూకిన తల్లి, ఇద్దరు పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూన్ 6: కుటుంబ కలహాలతో విసిగి వేసారిన వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్యాయ్నం చేసింది. ఈ ఘటనలోఎనిమిదేళ్ళ కుమార్తె మృతి చెందగా తల్లి ఆచూకీ కానరాలేదు. పదేళ్ళ కుమారుడు నీళ్ళలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లి మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు ఏలేరు కాలువలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మాతిరెడ్డి అక్కయ్యనాయుడుకు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామానికి చెందిన కనక మహాలక్ష్మి(35)తో పదేళ్ళ క్రితం వివాహం జరిగింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు ఏర్పడ్డాయి. మద్యం అలవాటు ఉన్న అక్కయ్యనాయుడు తరచూ భార్యతో తగాదా పడేవాడు. ఈ విభేదాలు అధికం కావడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి కనక మహాలక్ష్మి రోడ్డుకు వచ్చింది. జగన్నాథపురం సెంటర్‌లో ఉన్న మినీ బ్యాంకు నుండి 10 వేల రూపాయలు డ్రా చేసింది. అక్కడి నుండి ఆటో ఎక్కింది. నాతవరం మండలం ఎంబీ పట్నం సమీపంలోకి వచ్చే సరికి ఆటోను ఆపి పిల్లలతో సహా దిగిపోయింది. అక్కడి నుండి సమీపంలోని ఏలేరు కాలువకు చేరుకుని ఇద్దరు పిల్లలతో సహా తాను కూడా కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తల్లి కనక మహాలక్ష్మి, కుమార్తె యామిని నీటిలో మునిగిపోగా, ప్రసాద్ నీటిలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో మునిగిపోయిన చిన్నారి యామిని మృతదేహం లభ్యం కాగా, తల్లి మృతదేహం గల్లతైంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన ప్రసాద్ కేకలు వేయగా సమీప పొలాల్లో ఉన్న కూలీలు వచ్చి చూడగా అప్పటికే తల్లీ, కూతురు మునిగిపోవడాన్ని గుర్తించారు. ప్రసాద్ తండ్రికి ఫోన్ చేసి ప్రమాద సమాచారాన్ని తెలియజేయగా అక్కయ్యనాయుడు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ .రేవతమ్మ, నాతవరం ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆచూకీ కోసం పోలీసులు ఏలేరు కాలువలో గాలిస్తున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.