క్రైమ్/లీగల్

నాకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాలేగావ్ పేలుళ్లకేసులో శుక్రవారం ఇక్కడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2008నాటి పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. కేసు విచారణకు హాజరుకావల్సి ఉండగా ఈవారంలోరెండు సార్లు గైర్హాజరయ్యారు. కాషాయ దుస్తులు ధరించి ప్రజ్ఞా కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరు అనుచరులను వెంటబెట్టుకుని ఆమె కోర్టు హాలులోకి ప్రవేశించారు. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సీఎస్ పదాల్కర్ పేలుళ్ల గురించి ప్రశ్నించగా ‘నాకేమీ తెలియదు’అని ఆమె బదులిచ్చారు. 11 ఏళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ప్రజ్ఞా ఠాకూర్ నిందితురాలిగా ఉన్నారు. శుక్రవారం నాడు ఆమెతో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ ముగింపుదశకు చేరుకున్నందున నిందితులు వారానికోసారి కోర్టుకు విధిగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. ఇప్పటి వరకూ 116 మంది సాక్షులను విచారించినట్టు అందులో వైద్యులు కూడా ఉన్నారని పదాల్కర్ స్పష్టం చేశారు. దాదాపుప్రతి వాయిదాకూ తమతమ అడ్వొకేట్లను వెంటబెట్టుకుని నిందితులు కోర్టుకు హాజరవుతూ వచ్చారు. ఆదేశాలు చదవడం పూర్తయిన తరువాత ఠాకూర్, మరో నిందితుడు ద్వివేదిని న్యాయమూర్తి పిలిచారు. నిందితులు ఇద్దరూ బోనులో నిలబడి సాక్ష్యం ఇచ్చారు. ‘ఉత్తర మహారాష్టల్రోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్‌లో జరిగిన బాంబు పేలుళ్లతో మీకు సంబంధం ఉందా?’అని జడ్జి ప్రశ్నించారు. పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, వంద మంది గాయపడ్డారు. న్యాయమూర్తి ప్రశ్నకు ఠాకూర్ ‘ముఝే జాన్‌కారీ నహీ హై( పేలుళ్ల గురించి నాకు సమాచారం లేదు’అని బదులిచ్చారు. మరో నిందితుడు ద్వివేది కూడా అలాంటి సమాధానమే ఇచ్చారు. మరో ప్రశ్నకు 49ఏళ్ల ప్రజ్ఞా ఠాకూర్ బదులిస్తూ కోర్టు ఎంతమంది సాక్షులను విచారించిందీ కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. ఎరుపురంగు వస్త్రం పరచిన బల్లపై ఎంపీ కూర్చున్నారు. న్యాయమూర్తి కోర్టు ఆదేశాలను చదువుతున్నప్పుడు ఎంపీ కిటికీ వద్దే ఉండి వినడం కనిపించింది. ఆయన పిలవగానే బోనులోకి వచ్చారు. కోర్టు ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చున్నారు. కాగా గత నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆమె ఓడించారు. ఎంపీగా గెలిచిన తరువాత తొలిసారిగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో గత ఏడాది అక్టోబర్‌లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ తుది దశకు చేరుకున్నందున నిందితులందరూ వారానికోసారి విధిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి పదాల్కర్ ఆదేశించారు. మరీ తప్పనిసరి అయితేనే అది కూడా నిందితుడు లిఖిత పూర్వకంగా అభ్యర్థిస్తే మినహాయింపువిషయం పరిశీలిస్తామని జడ్జి వెల్లడించారు. సాక్షులందరి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌తోపాటు ఏడుగురు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఎంపీగా ఎన్నికైనందున పార్లమెంట్‌లో కొన్ని పనులు చూసుకోవల్సి ఉందని, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలన్న ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని కోర్టు తోసిపుచ్చింది.