క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 8: బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు గాయపడిన సంఘటన తిరుపతి మదనపల్లి మార్గంలోని భాకరాపేట ఘాట్‌లో శనివారం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని వేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. కాగా అకారణంగా ముగ్గురు వ్యక్తుల మృత్యువుకు కారణమైన డ్రైవర్‌ను అటుగా వస్తున్న కొంతమంది ప్రయాణికులు చితకబాదారు. తాను వాహనాన్ని అదుపు చేసేందుకు యత్నించినా కుదరలేదని డ్రైవర్ చెప్పే ప్రయత్నం చేశారు. కాగా ఆటో ఏకంగా బస్సు చక్రాల కింద ఉండిపోవడం, డ్రైవర్ ఎక్కడ తనపై మరోసారి దాడి చేస్తారని పారిపోవడంతో బస్సును పక్కకు తప్పించడానికి స్థానికులు విఫలయత్నం చేశారు. ఆటోలో ఉన్న ఓ యువకుడు బతికి ఉన్నాడనే ఆలోచనతోనే స్థానికులు బస్సును పక్కకు నెట్టేయత్నం చేశారు.
చిన్నగొట్టిగల్లు మండలం బత్తినవారిపల్లికి చెందిన రమణారెడ్డి, వెంకరమణ తిరుపతిలో శనివారం జరుగుతున్న వారపు సంతలో పొట్టేళ్లను కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి ఆటోలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్‌రోడ్డులో పీలేరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న కారును అధిగమించేందుకు ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో, బస్సు కిందపడి నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆటోలో ఉన్న రమణారెడ్డి, వెంకటరమణలతో పాటు ఆటోడ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సును లోయలోకి తోసేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న భాకరాపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టంపైన బస్సును వెనక్కు లాగి మృతదేహాలను బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భాకరాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.