క్రైమ్/లీగల్

హత్యాయత్నం కేసులో ఆరుగురికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూన్ 9: రెండు రోజుల క్రితం సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస వివరాలను వెల్లడించారు. సంగారెడ్డికి చెందిన నల్సాబ్‌గడ్డ ముఖ్దూంనగర్‌కు చెందిన పెయింటర్ రహమత్ అలీ కుమారుడు షేక్ ఇంతియాజ్(22) బోరబండకు చెందిన మోసిన్ కుమార్టె జయినాబ్ ఫాతిమా (19)ని ప్రేమించాడు. రంజాన్ పండుగ రోజు సదాశివపేటలోని దుర్గాలో పెళ్లి చేసుకున్నారు. ఇంతియాజ్, ఫాతిమా.. కుటుంబాలు బంధువులు అయినప్పటికీ వివాహం చేసుకోవడం ఫాతిమా కుటుంబీకులకు నచ్చలేదు. ఫాతిమా అదృశ్యం అయినట్టుగా తండ్రి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో ఫాతిమాను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి రాత్రి అవుతుండటంతో తల్లిదండ్రులతో పంపించామని చెప్పారు. తమ విచారణలో ఫాతిమా తాను ఇష్టపూర్తిగా ఇంతియాజ్‌ను వివాహం చేసుకున్నట్టు చెప్పడంతో మరుసటి రోజు తిరిగి పోలీస్‌స్టేషన్‌కు రప్పించి ఇరు కుటుంబాలకు కౌనె్సలింగ్ నిర్వహించి ఇరువురి సమ్మతి మేరకు ఇంతియాజ్ కుటుంబానికి ఫాతిమాను అప్పగించినట్టు తెలిపారు. దీంతో వారు సంగారెడ్డికి వెళ్తున్న క్రమంలో ఫాతిమా సోదరుడు ఫరూక్ షకిల్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి కత్తులతో దాడి చేశారని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితున్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు దాడిలో మొత్తం ఎనిమిది మంది పాల్గోన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడిలో పాల్గొన్న పాల్గొన్న సయ్యద్ ఫారూక్, మోసిన్ అలీ, మహ్మద్ అలీ, అహ్మద్ అలీ, జకీరా బేగం, ఫాతిమాలను అరెస్టు చేసినట్టు చెప్పారు. కాగా ఇదే కేసుతో సంబందం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.