క్రైమ్/లీగల్

బరితెగించిన ఇసుక మాఫియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, జూన్ 9: కడప జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. పెన్నానది నుంచి ఇసుక అక్రమంగా తరలించడమేగాక అడ్డుకోబోయిన అధికారుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం జరిగిన సంఘటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయిన సిద్దవటం వీఆర్వో ఆరిఫ్, వీఆర్‌ఏ వెంకటపతిని ట్రాక్టర్‌తో గుద్దించడంతో వారు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట-సిద్దవటం ప్రధాన రహదారిలో దెయ్యాలకోన రోడ్డు సమీపంలో ఆదివారం అక్రమంగా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా సిద్దవటం టౌన్ వీఆర్వో ఆరిఫ్, వీఆర్‌ఏ వెంకటపతి ద్విచక్ర వాహనంపై వెంబడించి అడ్టుకోబోయారు. అయితే ఇది గమనించిన డ్రైవర్ ట్రాక్టర్‌ను వేగంగా పోనిస్తూ ద్విచక్ర వాహనంపై వెంబడించిన వీఆర్వో, వీఆర్‌ఏలను ఢీకొట్టి పారిపోయాడు. దీంతో వారిద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంలో వీఆర్వో ఆరిఫ్‌కు కుడికాలు, కుడిచేతికి తీవ్రగాయాలయ్యాయి. వీఆర్‌ఏ వెంకటపతి సైతం గాయపడ్డాడు. ఈ సందర్భంగా వీఆర్వో ఆరిఫ్ మాట్లాడుతూ ఎస్.రాజంపేటకు చెందిన రమణ అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ట్రాక్టర్‌ను ఆపే ప్రయత్నం చేశామన్నారు. అయితే డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్‌ను వెంబడించామన్నారు. దెయ్యాలకోన రోడ్డు సమీపం వద్ద ఆపే ప్రయత్నం చేసినట్లు నటించి ట్రాక్టర్‌తో తమ వాహనాన్ని ఢీ కొట్టించి పారిపోయాడన్నారు. ఒంటిమిట్ట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.