క్రైమ్/లీగల్

కసాయి కూతురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: మనుషుల్లో మానవత్వం నానాటికీ మంటకలిసి పోతోంది. ‘కంటే కూతురినే కనాలి’ అని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన కసాయి కూతురు ఉదంతమిది. 78 సంవత్సరాల తన కన్న తల్లిని దారుణంగా శారీరకంగా, మానసికంగా వేధించి, హింసించి ఆఖరికి తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోంలో పడేసిన వైనం చూస్తే ఎవరైనా కంట తడి పెట్టక మానరు. ఢిల్లీలోని లజపత్‌నగర్ దయానంద్ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకొంది. ఢిల్లీ కోర్టు జోక్యం చేసుకోవడంతో సీనియర్ సిటిజన్ అయిన ఆ కన్నతల్లికి మోక్షం కలిగింది. నానా రకాలుగా తల్లిని వేధించిన ఆ కూతురు ఢిల్లీలోని ‘హెల్పింగ్ బ్రియాంజ్’ వృద్ధాశ్రమంలో చేర్పించింది. విషయం తెలుసుకొన్న వృద్ధురాలి సోదరి వృద్ధాశ్రమానికి వెళ్లి చూడగా దయనీయ పరిస్థితిలో పడి ఉంది. దీంతో చలించిన ఆమె ఈ విషయాన్ని ఢిల్లీలోని అమర్‌కాలనీలోని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసుల సూచన మేరకు ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో వేశారు. మెజిస్ట్రేట్ మనిషా ఖురానా కక్కర్ కేసును విచారించారు. డాక్టర్ అయిన వృద్ధురాలి సోదరి తనతో ఆ ‘తల్లి’ని ఉంచుకోవడానికి అంగీకరించింది. ఈమేరకు ‘ఆమె’ను సోదరి వద్దకు తీసుకెళ్లాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
తల్లిని నానా హింసలకు గురి చేసిన సదరు ‘కసాయి కూతురు’పై కేసు నమోదైంది.