క్రైమ్/లీగల్

న్యాయమూర్తుల పేరుతో ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 11: ‘నేను జడ్జీని మాట్లాడుతున్నాను.. మీపై పీడీ కేసు ఉంది కదా? నాకు కొంచెం సొమ్ము ముట్టచెబితే దానిని మాఫీ చేస్తాను’ అంటూ ఏకంగా న్యాయమూర్తుల పేరుతో పలువురిని మోసం చేసి కాసులు దండుకున్న వ్యక్తిని మంగళవారం కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు.
వరుస చోరీలకు పాల్పడుతూ పీడీ యాక్టుల అమలుతో జైలుశిక్ష అనుభవిస్తున్న వారిని మాయ మాటలతో నమ్మించి కేసులు మాఫీ చేయిస్తానంటూ జడ్జీల పేరుతో నగరంలో కాసులు దండుకుంటున్న నల్గొండ జిల్లా పెద్దాపూర్ మండలం కుంకుడుచేటు తండా గ్రామానికి చెందిన రామవాత్ రవిని కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఏసీపీ పి.శోభన్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు సీహెచ్.దేవారెడ్డి, ఎస్.శ్రీనివాస రావు, కె.జనార్ధన్ రెడ్డి, ఎస్‌ఐ నర్సయ్యలతో పాటు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
మంథనికి చెందిన శ్రీనివాస్‌కు ఫోన్ చేసి జైళ్లో ఉన్న ఎడ్ల శ్రీనివాస్‌పై ఉన్న పీడీ యాక్టు రద్దు చేయిస్తానని నమ్మబలకడంతో రెండు లక్షలు రవికి చెల్లించారు. ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించినప్పటికీ వారిపై ఉన్న పీడీ యాక్టు కేసులు మాఫీ కాకపోవడంతో మోసపోయినట్టు తెలుసుకున్నారు. చేసేదేమీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిని ముగ్గులోకి లాగి ఎలాగైనా పట్టుకునేందుకు పోలీసులు పథకం వేశారు. పోలీసులు పన్నిన ఉచ్చులో రవి చిక్కుకొన్నాడు.