క్రైమ్/లీగల్

మద్యానికి బానిసై వేధించడంతో కొడుకుని కడతేర్చిన కన్నతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, జూన్ 11 : మద్యానికి బానిసై వేధిస్తూ నిత్యం కొడుతూ, దూషిస్తూ కసాయిగా మారిన కొడుకుని కన్నతల్లే కడతేర్చిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సుభాష్ నగర్ (కొత్తపోడు) గ్రామానికి చెందిన బెజ్జం సతీష్ అలియాస్ చంటి (28)ని తల్లి మరియమ్మ హతమార్చింది. సతీష్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలున్నారు. సతీష్ ప్రవర్తన మంచిగా లేకపోవడంతో అతని భార్య పిల్లలను తీసుకుని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సతీష్‌పై అనేకసార్లు భార్య శిల్ప కేసులు పెట్టింది. పంచాయతీలు జరిగాయి. దీంతో సతీష్ మద్యానికి బాగా అలవాటయ్యాడు. తల్లితో సుభాష్ నగర్‌లో నివసిస్తున్న అతను ఏపనికీ వెళ్లకుండా మద్యం సేవిస్తూ నిత్యం తల్లిని వేధించేవాడు. ఐదు నెలల క్రితం నుంచి తల్లిని తాగి వచ్చి కొట్టటం, విపరీతంగా దూషిస్తుండటంతో ప్రతినిత్యం గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి సతీష్ బాగా తాగి వచ్చి తల్లిని దూషిస్తూ పక్కనే ఉన్న రోకలిబండతో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించడంతో అడ్డుకొని రోకలి బండను లాగి ఆవేశంలో అతడిని కొట్టడంతో బలమైన గాయం తగిలి సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న హుజూర్‌నగర్ సీఐ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి మరియమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ భార్య శిల్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హుజూర్‌నగర్ సీఐ భాస్కర్ తెలిపారు.