క్రైమ్/లీగల్

ప్రభుత్వ గుర్తింపు పొందని నారాయణ స్కూల్ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి కనీసం గుర్తింపు లేకుండానే ఏడాది కాలంగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులతో సత్యనారాయణపురంలో నడుస్తున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పునఃప్రారంభం రోజే జిల్లా ఉప విద్యాశాఖాధికారి రవికుమార్ సీజ్ చేశారు. ఈ హఠాత్ పరిణామం పట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు కంగుతిన్నారు. కొనే్నళ్లుగా కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఒకే గుర్తింపుతో వీధికో బ్రాంచిని ప్రారంభిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఇదేవిధంగా నారాయణ విద్యాసంస్థ ఏడాది క్రితం సత్యనారాయణపురంలో పాఠశాలను ప్రారంభించింది. రవికుమార్ ఇప్పటికే మూడుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పాఠశాలకు గుర్తింపు లేదని సమాచారం పంపించారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో గుర్తింపు లేకుండానే నేడు పునఃప్రారంభించారు. గతంలో తల్లిదండ్రులు ఎవరైనా ప్రశ్నిస్తే తమకు నగరంలో అనేక గుర్తింపు బ్రాంచీలు ఉన్నాయని, అవసరమైతే పిల్లలను అక్కడికి పంపించటం, లేదా ఆ పాఠశాలల పేరుతో అడ్మిషన్లు కొనసాగిస్తామని యాజమాన్యం వారు నమ్మించారు. అమాయక తల్లిదండ్రులు భారీగా ఫీజులు చెల్లిస్తూ పిల్లలను చేర్పిండాన్ని గమనించిన రవికుమార్ బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లి తాళాలు వేశారు. లక్ష రూపాయలు జరిమానా కూడా విధించారు. దీంతో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయాందోళనలతో తమ పాఠశాలను మూసేసి పిల్లలకు ఇళ్లకు పంపించాయి.