క్రైమ్/లీగల్

నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ సభ్యుడికి ఐదు రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ‘్ఫలా-ఐ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) సభ్యునిగా భావిస్తున్న 44 ఏళ్ల నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ గులామ్ బషీర్ ధరమ్‌పురియాను ఢిల్లీ కోర్టు గురువారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఇతను ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్న అభియోగంపై అరెస్టు అయ్యాడు. ఈ కేసులో జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈమేరకు న్యాయమూర్తి అనిల్ అంటిల్ తీర్పు వెలువరించారు. 12 రోజుల కస్టడీకి నిందితుడిని తమకు అప్పగించాలని ఎన్‌ఐఏ కోర్టుకు విన్నవించింది. కాగా నిందితుడు గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లా వాస్తవ్యుడు. బుధవారం అతను దుబాయ్ నుంచి విమానంలో వచ్చి ఇందిరాగాంథీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగుతూనే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఉగ్రవాద సంస్థల నుంచి ఎఫ్‌ఐఎఫ్‌కు, అక్కడి నుంచి వివిధ గ్రూపులకు నిధులు హవాలా ఆపరేటర్ల ద్వారా వెళుతున్నాయని, వాటిద్వారా భయానక చర్యలు చేపట్టి భారత్‌ను అతలాకుతలం చేయాలన్న కుట్ర జరుగుతోందన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా నిందితుడి తరపు డిఫెన్స్ న్యాయవాది ఎంఎస్ ఖాన్ ఎన్‌ఐఏ విజ్ఞప్తికి అంగీకరించవద్దని వాదించారు. వారెంట్ లేకుండా తన క్లయింట్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. తాను లొంగిపోతానని, అందుకు కొంత సమ యం ఇవ్వాలని నిందితుడు దరఖాస్తు చే సుకున్నాడని, అతను భారత్‌కు వచ్చిందే విచారణకు సహకరించేందుకని తెలిపా రు. అంతకుముందే టెలిఫోన్లో ఈ విషయాన్ని నిందితుడు దర్యాప్తు సంస్థకు తె లిపాడన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఐదుగురు అరెస్టయ్యారు.