క్రైమ్/లీగల్

బాలుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 13: ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్లలో నవి రత్నా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సంపత్ సురెందర్ రెడ్డి కుమారుడు అభినవ్ చంద్ర (15) నారాయణ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేడు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.