క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 9: రోడ్డుప్రమాదంలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు మృతిచెందగా, మరో విద్యార్థి గాయాలపాలైన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటనతో గుడిమల్కాపూర్‌లో విషాధచాయలు అలుముకున్నాయి.
ఇన్స్‌పెక్టర్ ఎన్‌ఎల్‌ఎన్ రాజు కథనం ప్రకారం.గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్ (16), మధు (16), చందు (16) మిత్రులు. వీరిలో పవన్‌కుమార్ లంగర్‌హౌస్‌లోని రాబర్ట్‌పీటర్ హై స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. మధు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి హై స్కూల్‌లో చదువుతున్నాడు. చందు కూడా మెహిదీపట్నంలోని ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ప్రతిరోజూ వీరు ముగ్గురు గుడిమల్కాపూర్‌కు ఉద యం పూట ట్యూషన్‌కు వెళుతుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో వెళ్లగా ట్యూష న్ లేకపోవడంతో ముగ్గురు కలిసి ట్యాంక్‌బండ్ చూడటానికి బైక్‌పై బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎండీసీ వద్ద ఆర్‌టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఆటో రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ క్రమంలో పక్కన నుంచి వెళు తున్న బస్సు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెం దగా, మధు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. చందుకి వైద్యం అం దిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.