క్రైమ్/లీగల్

బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూన్ 14: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రోత్ సెంటర్‌లోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో 52 మంది కార్మికులు పని చేస్తుండగా శుక్రవారం ఉదయం 22 మంది విధులకు హాజరయ్యారు. సుమారు 10 గంటల సమయంలో బాయిలర్ పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన పామోటి సురేష్(35), బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన ఆలుబిల్లి జగదీష్(32) ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. బాడంగి మండలం బీమవరం గ్రామానికి చెందిన చింతల గోపాలనాయుడు, అల్లుగోవింద, రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన పతివాడ శ్రీనివాసరావు ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న కలెక్టర్ హరి జవహర్‌లాల్, ఏఎస్పీ గౌతమిశాలి, సబ్ కలెక్టర్ చేతన్ సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదంపై ఆరా తీశారు. కార్మికులు, యాజమాన్యాన్ని విడివిడిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులు పూర్తిగా కాలి బూడిద కావడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదన వర్ణాణాతీతం. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేంతవరకు మృతదేహాలను తరలించేది లేదని బీష్మించుకుని కూర్చొన్నారు. దీంతో కలెక్టర్ హరిజవహర్‌లాల్ స్పందించి యాజమాన్యం, మృతుల కుటుంబాలతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.