క్రైమ్/లీగల్

కౌన్సిలింగ్‌ గడువు పెంచుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సంబంధించి గడువును పెంచుతారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రానికి స్పష్టం చేసింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోయామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అడ్మిషన్లకు సంబంధించిన గడువును పెంచేది లేనిది అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రంజిత్ బెనర్జీని న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ తరఫున విక్రంజిత్ కోర్టులో వాదించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 1300 విద్యా సంస్థల తరఫున భారత ఎడ్యుకేషన్ సొసైటీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం విచారించింది. 500 సీట్లకు పైగా అడ్మిషన్లకు సంబంధించి కౌన్సిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ఈ సంస్థ తన పిటీషన్‌లో కోరింది. సాంకేతిక కొన్ని ఇతర కారణాల మూలంగా దేశంలో డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీల్లో మెడికల్ సీట్లు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయని ఈ సంస్థ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్ కోర్టుకు నివేదించారు. దీని వల్ల సదరు విద్యా సంస్థకు భారీ నష్టం వాటిల్లుతున్నదని వివరించారు. ఇలా వృధా అయిన సీట్ల కారణంగా ఇటు విద్యార్థులకు, సదరు విద్యా సంస్థకు కూడా నష్టం వాటిల్లుతున్నదన్నారు. నాణ్యతాయుతమైన వౌలిక సదుపాయాలు కల్పించి వైద్య విద్యా బోధనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఈ సంస్థలు సీట్లు ఖాళీగా ఉండిపోవడం వల్ల నష్టపోతున్నాయని అన్నారు. ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి సంబంధించిన కౌన్సిలింగ్‌కు మరో అవకాశం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నీట్‌లో అర్హత పొందిన విద్యార్థులకు పిజీ కోర్సుల్లో చేరేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కౌన్సిలింగ్ వ్యవధిని ఒక వారం లేదా ఇంకా కొంత ఎక్కువ కాలం పెంచాలని ఈ సంస్థ కోర్టును అభ్యర్థించింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా వృధా కాకుండా విద్యార్థులు ప్రవేశం పొందగలుగుతారని అన్నారు. పీజీ మెడికల్ కోర్సుల చివరి తేదీ మే 31తో ముగిసిన సంగతి తెలిసిందే.