క్రైమ్/లీగల్

విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూన్ 17: విద్యుత్ తీగలు తెగి మీదపడడంతో మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సజీవదహనమయ్యారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతులిద్దరూ మాజీ సైనికులు కావడం గమనార్హం. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా లింగాల మండలం గునకనపల్లెకు చెందిన ప్రతాపరెడ్డి (36), వేముల మండలం నల్లచెరువుపల్లికి చెందిన గోవర్ధన్‌రెడ్డి (38) కలిసి సోమవారం మోటార్‌బైక్‌పై పులివెందుల పట్టణంలోని కదిరి రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న గంగమ్మగుడి వెనుకవైపు వెళ్తుండగా ఒక్కసారిగా 11 కెవి విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. దీంతో మంటలు లేచి ఇద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. కేసు దర్యాప్తులో ఉంది.