క్రైమ్/లీగల్

రవిప్రకాష్ కేసుపై విచారణ నిర్ణయం రిజర్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం మరోమారు వాదనలు జరిగాయి. నిర్ణయాన్ని హైకోర్టు రిజర్వు చేసింది. గతంలో ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగిన అనంతరం హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అహ్లువాలియా వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌పై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కేసులు వేశారని ఆయన పేర్కోన్నారు. సినీనటుడు శివాజీ, రవిప్రకాశ్ మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు నిజమేనని, డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రవిప్రకాశ్ ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని అహ్లువాలియా వాదనలు వినిపించారు. టీవీ 9 కొనుగోలుగు నల్లధనం ఉపయోగించారని, 500 కోట్లు మాత్రమే బ్యాంకుల ద్వారా చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తమ నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.