క్రైమ్/లీగల్

అక్రమ వెంచర్లపై హెచ్‌ఎండీఏ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 18: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వెంచర్లపై హెచ్‌ఎండీఏ అధికారులు కొరడా ఝులుపించారు. ఇబ్రహీంపట్నం నగరపంచాయతీ పరిధిలోని మూడు ప్రైవేటు వెంచర్లతో పాటు, నాగాన్‌పల్లి గ్రామ సమీపంలోని నాలుగు వెంచర్లలో హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారిని శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు నిర్మాణాలను కూల్చి వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసి, ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని వెంటనే అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారిణి శ్రీదేవి తెలిపారు. మండలంలో ఇలాంటి అనేక వెంచర్లు ఉన్నాయని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని వాటిపై విచారణ జరిపి అక్రమ వెంచర్ల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.