క్రైమ్/లీగల్

చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, జూన్ 20: ప్రమాదవశాత్తు చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. చర్లపల్లి అగ్నిమాపక అధికారి శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్-1లో విశాల్ ప్లాస్టిక్ పారిశ్రామలో రాత్రి 9గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. పారిశ్రామలో ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతోనే భారీగా మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం షాట్‌సర్య్కూట్‌తో జరిగిందా.. లేదా మానవ తప్పిదామా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పరిశ్రమలో కార్మికులు పని ముగించుకొని వెళ్లిన రెండు గంటల తరువాత ప్రమాదం జరుగడంపై అనేక అనుమానులు కలుగుతున్నాయి. కేసును కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.