క్రైమ్/లీగల్

సీఎంపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన యువకుడికి ఐదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. భువనగిరికి చెందిన ఆకుతోట రామకృష్ణకు ఐదేళ్ల జైలుతో పాటు రెండు వేల రూపాయిల జరిమానా కూడా విధించింది. కేసీఆర్‌పై ఆకుతోట రామకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాదన్నపేట పోలీసులకు పాతబస్తీకి చెందిన ఇబ్రహీం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. రామకృష్ణపై సైబర్ క్రైమ్ పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు ప్రవేశపెట్టగా , కోర్టు ఆ యువకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.