క్రైమ్/లీగల్

విమానాశ్రయంలో సూట్ కేసు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూన్ 21:: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల అనుమానాస్పదంగా ఓ సూట్‌కేసు పడి ఉండటంతో అధికారులు పరుగులు పెట్టిన సంఘటన శుక్రవారం చోటు చేసుకునింది. వివరాల్లోకి వెడితే సాయంత్రం విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చే మార్గంలో నల్లటి సూట్ కేసు వీల్ చైర్‌పై ఉండటాన్ని ప్రయాణికులు ఎవరూ పట్టించుకోలేదు. మరి కొందరు దాని పక్కనే నిలబడి అనుమానాస్పదంగా చూస్తుండటంతో అందిరిలో అనుమానాలు రేకెత్తాయి. దీంతో అక్కడే ఉన్న విమానాశ్రయ భద్రతా సిబ్బంది, బాండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని మెటల్ డిటెక్టర్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. కాగా హైదరాబాదు నుంచి 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఓ ప్రయాణికుడు తనతో తెచ్చుకున్న లగేజీని వీల్ చైర్‌లో తీసుకువచ్చి కారులో తీసుకు వెళ్లే సమయంలో ఈ సూట్‌కేసును మరచిపోయాడని ఆ తరువాత గుర్తించారు. సూట్‌కేసులో ఎలాంటి ప్రేలుడు పదార్థాలు లేవని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.