క్రైమ్/లీగల్

ట్రైకార్ రుణాల మంజూరులో అక్రమాలపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ట్రైకార్ రుణాల మంజూరులో అవినీతి జరిగినట్లుగా తన దృష్టికి వచ్చిందని, కార్ల కొనుగోలు రుణాల మంజూరులో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆమె తన చాంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రైకార్ రుణాల మంజూరులో నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీసీసీ ప్రధాన కార్యాలయ భవనాన్ని 5 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టాల్లో ఉన్న గిరిజన సహకార సంస్థను లాభాల బాటలో తెచ్చేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గిరిపుత్రిక, పెళ్లికానుక, అమ్మఒడి, చేయూత పథకాల అమల్లో నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. గిరిజనులకు కాఫీ, జీడిపప్పు ప్రొసెసింగ్ పరికరాలు, కాఫీ గ్రైండింగ్ యూనిట్లు మంజూరు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. మినీ గురుకులాల నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని, 31 గురుకులాను తక్షణమే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించ వద్దని, ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు.
16 ఏఈ పోస్టుల భర్తీ, కొత్తగా గిరి సేవా కేంద్రాల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆ శాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు, అదనపు డైరెక్టర్ చినవీరభద్రుడు, జీసీసీ ఎండీ టి.బాబూరావు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.