క్రైమ్/లీగల్

జూలై 10వరకు అమలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: పుదుచ్చేరి ప్రభుత్వం ఆర్థిక భారం పడే తన కేబినెట్ నిర్ణయాలను అమలు చేయకుండా సంయమనం పాటించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై పదో తేదీ వరకు పొడిగించింది. న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని సుదీర్ఘంగా విచారించాల్సి ఉందని, అందువల్ల ఈ పిటిషన్‌ను రెగ్యులర్ బెంచ్ ముందు ఉంచుతున్నట్టు తెలిపింది. అన్ని మధ్యంతర అప్లికేషన్లతో పాటు ఈ పిటిషన్ విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసినట్టు ధర్మాసనం వెల్లడించింది. పుదుచ్చేరిలోని రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ, ఒక శాఖ పేరు మార్పు, మూతపడిన ఒక ఫ్యాక్టరీని వేలం వేయడం- వంటి మూడు నిర్ణయాలను తీసుకున్నట్టు పుదుచ్చేరి ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.