క్రైమ్/లీగల్

వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్తగా పోలీసు అధికారులను నియమించింది. గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో పని చేసిన అధికారులను బదిలీ చేసింది. మార్చి 15న పులివెందులలోని సొంత ఇంట్లో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం వివేకా హత్య కేసులో నిజానిజాలు తేల్చాలని జగన్మోహనరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. కొత్తగా నలుగురు డీఎస్‌పీలు, ఐదుగురు సీఐలతో పాటు 35 మంది కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్‌పీలను వైఎస్ వివేకా హత్యపై దర్యాప్తు చేయడానికి నియమించారు. గత రెండు రోజుల నుంచి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఘటనలను వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడానికి నియమించిన అధికారులు పులివెందులకు చేరుకోవడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య జరిగిన ఘటనకు ముందు తర్వాత టీడీపీ నేతలు ఎవరెవరితో మాట్లాడిన వివరాలను రాబట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుంటున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతలతో పాటు వైకాపా నేతలను సైతం స్టేషన్‌కు రావాలని డీఎస్‌పీలు ఆదేశిస్తున్నారు. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డికి శనివారం డీఎస్‌పీ ఫోన్ చేసి పులివెందుల స్టేషన్‌కు రావాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గం నుంచి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి సతీష్‌కుమార్‌రెడ్డిని సైతం పోలీసులు స్టేషన్‌కు రావాలని సూచించారు. గత మార్చి 15వ తేదీకి వారం రోజులు ముందు తర్వాత ఎక్కడ ఉన్నారన్న సమాచారం పోలీసులకు చెప్పాలని దేవగుడి, సతీష్‌లకు డీఎస్‌పీ సూచించారు. వారిద్దరి ఫోన్ కాల్ డేటాను ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు తెల్సింది. టీడీపీ ముఖ్యనేతలకు పోలీసులు ఫోన్లు చేస్తున్న సమాచారం తెలియడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఊళ్లను వదలి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేస్తున్నారు. పోలీస్ విచారణలో ఇటు వైకాపా, అటు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల్ని స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహతంగా ఉన్న సర్వోత్తమరెడ్డిని శనివారం స్టేషన్‌కు పిలిపించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన ముందు రోజు తర్వాత సర్వోత్తమరెడ్డికి వచ్చిన ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్‌గోయంగ్ కాల్స్ చేసిన వ్యక్తులకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేసిన వ్యక్తులకు సర్వోత్తమరెడ్డి చేత ఫోన్లు చేయించారు. వివేకా హత్య ముందు తర్వాత సర్వోత్తమరెడ్డికి దాదాపు 1800 ఫోన్లు కాల్స్ వచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే, తాను వైకాపా ఎన్నికల ప్రచారం ఉండగా పార్టీ నేతలు తనకు చేసిన ఫోన్ కాల్స్ అంటూ సమాధానం ఇచ్చారని తెల్సింది. పోలీసు విచారణకు వచ్చిన వ్యక్తుల ఫోన్ల వివరాలను పోలీసులు రికార్డు చేస్తున్నారు. తాము సమాచార సేకరణ కోసం అంటూ పోలీసులు చెబుతున్నా ఇటు వైకాపా, అటు టీడీపీ నేతల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇలా వైకాపా నేతలను సైతం పోలీసులు ప్రశ్నిస్తుండడంతో ఎప్పుడు ఎవర్ని పిలుస్తారోనని పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం ఒక్కరోజే 800 మందికి పైగా టీడీడీ, వైకాపా నేతలకు ఫోన్లు వెళ్ళాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారని వివేకా ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా హైకోర్టు నిరాకరించింది.

వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)