క్రైమ్/లీగల్

సెల్ టవర్ ఎక్కి నిందితుడు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 22: అనుమానితుడిని పట్టుకున్న పోలీసులకు చుక్కలు చూపించాడు నిందితుడు. వివరాలల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ ఓ మిస్సింగ్ కేసులో భాగంగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. మిస్సింగ్ కేసులో అనుమానితుడైన శ్రీ్భమ్‌శంకర్ అనే వ్యక్తిని విచారించారు. తన వెంట వస్తే తప్పిపోయిన వ్యక్తిని చూపిస్తానని తెలపడంతో శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు అనుమానితుని వెంటపెట్టుకొని బాచుపల్లి చౌరస్తాలోని సరితా వైన్స్ ఎదురుగా వున్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదించాడు. దీంతో ఈ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో బాచుపల్లి ఎస్‌ఐ వీరశేఖర్ చాకచక్యంగా వ్యవహరించి స్ధానికుల సహకారంతో నిందితుడిని కిందకు దింపాడు.
అదుపు తప్పి డీసీఎం బోల్తా
కొత్తూరు రూరల్, జూన్ 22: అధిక లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడిన సంఘటన నందిగామ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శనివారం నందిగామ మండల పరిధిలోని చంద్రాయన్‌గూడ గ్రామ సమీపంలోని పాత జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్న డీసీఎం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో పాత జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ని తొలగించారు.