క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 22: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్ గుడిసెల్లో నివసిస్తున్న నల్డొ జిల్లా నిడమనూరు మండలం ఉట్నూరు గ్రామానికి చెందిన ఇస్త్రం వినయ్ (19) కూలీ. ఇదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఇనుప బండిపై ఇసుక తీసికెళ్తుండగా కింద బండలు వేస్తున్న విద్యుత్ వైరు తెగి ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలో ఇదే రెండో సారి విద్యుత్ ప్రమాదం. ఇప్పటికే యాజమాన్యం నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోగా తాజాగా మరొక కూలీ మరణించాడు. వరుస ప్రమాదాలతో పని చేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తుండటం గమనార్హం. జాగ్రత్తలు తీసుకోకపోవడం శోఛనీయం.