క్రైమ్/లీగల్

పెరోల్ కోసం గుర్మీత్ దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్‌తక్ (హర్యానా), జూన్ 22: డేరా సచ్చా సౌదా (డీఎస్‌ఎస్) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 42 రోజుల పాటు పెరోల్ కావాలని కోరాడు. హర్యానాలోని సీర్సాలో గల తన పంట చేలలో వ్యవసాయం చేసుకోవడానికి పెరోల్ కావాలని అతను కోరినట్టు అధికారులు శనివారం తెలిపారు. రెండు అత్యాచార కేసులతో పాటు ఒక జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన 51 ఏళ్ల సింగ్ ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. సింగ్ పెరోల్ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ సీర్సా జిల్లా పాలనాయంత్రాంగానికి ఒక లేఖలో తెలిపారు. గుర్మీత్‌ను పెరోల్‌పై విడుదల చేయాలా? వద్దా? అనే విషయాన్ని తెలపాలని జూన్ 18న రాసిన లేఖలో జైలు సూపరింటెండెంట్ కోరారు.