క్రైమ్/లీగల్

ఉరివేసుకుని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 23: ఆర్థిక ఇబ్బందులతో తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ(32) ఐదు రోజుల క్రితం ఉద్యోగం కోసం మేడ్చల్‌లోని తన స్నేహితుడు మహేశ్ వద్దకు విచ్చేశాడు. మహేశ్ రూమ్‌లోనే ఉంటున్నాడు. ఈ నెల 22వ తేదీన మహేశ్ డ్యూటీకి వెళ్లగా మురళీకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన మహేశ్ రూమ్‌లో విగతజీవిగా పడివున్న మురళీకృష్ణ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. మురళీకృష్ణ గత కొన్ని నెలలుగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.