క్రైమ్/లీగల్

బోర్డు తిప్పేసిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు రూరల్, జూన్ 23 : కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మిగనూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘జాన్ ఫైనాన్స్ కంపెనీ’ యాజమాన్యం దాదాపు రూ. 14 లక్షల ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జాన్ ఫైనాన్స్ కంపెనీ 2018 డిసెంబర్ 15వ తేదీ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రారంభమైంది. నిర్వాహకులు ముందుగా పిగ్మి రూపంలో డబ్బులు వసూలు చేసి 3 నెలలు తర్వాత రుణాలు ఇస్తామని ఖాతాదారులను నమ్మబలికారు. ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఆరుగురు ఏజెంట్లను ఏర్పాటు నియమించారు. దీంతో పట్టణ ప్రజలు 200 మంది ఖాతాదారులుగా చేరి కంపెనీ ఏజెంట్లకు వారానికి రూ. 580 చొప్పున చెల్లించారు. ఇలా 3 నెలల పాటు 200 మంది ఖాతాదారులతో రూ. 13.96 లక్షలు వసూలు చేశారు. అయితే గత మార్చి తర్వాత కంపెనీ ఏజెంట్లు కలెక్షన్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఖాతాదారులు కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా బోర్డు తిప్పేసినట్లు తెలిసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీ్ధర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరులో జాన్ ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసిన మాట వాస్తవమేనని, ఆ ఫైనాన్స్‌పై కంపెనీపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.