క్రైమ్/లీగల్

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 25: 300 జిలిటిన్‌స్టిక్స్, 200 డిటోనేటర్ల పేలుడు పదార్థాలను మంగళవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ మురళీకృష్ణ కథనం మేరకు మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ ముంబై-చెన్నై జాతీయరహదారి పక్కనే వెలసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మదనపల్లె పట్టణానికి చెందిన నూర్ అనే వ్యాపారి నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న సీఐ తనఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామన్నారు. పరిశ్రమల ప్రాంత సమీపంలో సుమారు 10పల్లెలకు పైగా గ్రామీణప్రాంతాల ప్రజలు నివాసాలు ఉంటున్నారని సీఐ పేర్కొన్నారు. తనకు నిర్ధేశిత పేలుడు పదార్థాల విక్రయాలపై ప్రభుత్వ అనుమతి లైసెన్స్ ఉందని వ్యాపారి నూర్ సీఐకు వెల్లడించారు. ప్రజలు, నివాసప్రాంతాలకు నిర్దేశిత దూరంలో ప్రభుత్వ అనుమతిపై నిల్వవుంచుకోవాలని, జన నివాసాల నడుమ నిల్వవుంచడం నేరమని అందువల్ల వ్యాపారి నూర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిల్వవుంచిన జెలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.