క్రైమ్/లీగల్

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలు ఎదుర్కొని జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. హత్య జరిగిన రోజు వీరు అక్కడి సాక్షాలను తారుమారు చేశారన్న అభియోగంపై పోలీసులు వీరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వివేకా హత్య జరిగి 90 రోజులు గడిచినా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. జైలులో ఉన్న ముగ్గురు గతంలో పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినా మంజూరు కాలేదు. అయితే కేసులో చార్జిషీట్ దాఖలు కాకపోవడంతో గురువారం పులివెందుల మెజిస్ట్రేట్ కిషోర్‌కుమార్ వీరు ముగ్గురికి బెయిల్ మంజూరుచేశారు. ఇద్దరి పూచీకత్తుపై గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ పులివెందుల సబ్‌జైలు నుంచి బయటకు వచ్చారు.
చిత్రం...పులివెందుల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తున్న వివేకా హత్య కేసు నిందితులు