క్రైమ్/లీగల్

అక్షరాభ్యాసానికి వెళ్తూ అనంత లోకాలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున 6 గంటల ప్రాంతం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండున్నర సంవత్సరాల బాలునితో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సదాశివనగర్ ఎస్‌ఐ. జగడం నరేష్ కథనం ప్రకారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం హైకోర్టు కాలనీకి చెందిన రఘురాం కుటుంబం కారు లో బాసర సరస్వతి ఆలయంలో పిల్లలకు అక్షారాభ్యసం చేయించేందుకు బయలుదేరింది. తెల్లవారు జామున టీఎస్.08. ఇబి1445 ఫోర్డ్‌పిగో కారులో వెళ్తుండగా జిల్లాలోని సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి స్టేజీ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో ఎగిరి అవతల వైపు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీ .25.5972 నంబర్ లారీ డీజిల్ ట్యాంక్‌ను ఢీకొంది. లారీ ట్యాంకర్ పగిలి లారీకి మంటలు అంటుకుని లారీ దగ్ధం కాగా, కారులో ప్రయాణిస్తున్న నంబూరి రఘురాం (33), నాగల సునీత (31), రెండున్నర ఏళ్ల నాగల అభిరామ్, నంబూరి రమాదేవి (50) మృతి చెందారు. కారులోనే సునీత, రఘురామ్ చనిపోయి రక్తపుముద్ద అయ్యారు. రమాదేవి కారులోంచి ఎగిరి రోడ్డుపై పడి అక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రాకేశ్, అభిరామ్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా, అభిరామ్ అభిరామ్ మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ప్రమాదంలో నాగల రాకేష్ ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలతో ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం దృశ్యం చూపరులను ఎంతో కలచి వేసింది. దీంతో జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దాదాపు నాల్గు గంటల పాటు జాతీయ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయ. లారీ డ్రైవర్ ఆచూకీ తెలియరాలేదు.
చిత్రం...రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు ముందు భాగంలో మృతదేహాలు