క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూన్ 27: భారీ అవినీతి అక్రమార్జనకు పాల్పడుతూ లక్షల రుపాయలు దండుకుంటున్న మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీత గురువారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రెవెన్యూ చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకొని డాక్యుమెంట్ రైటర్ల మధ్యవర్తిత్వంతో క్రయవిక్రయదార్లను భయబ్రాంతులకు గురి చేస్తూ అనునిత్వం భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్న సబ్ రిజిస్ట్రార్ సంగీతను పట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక వెంచర్‌లోని రెండు ప్లాట్ల రిజిస్ట్రాషన్, ఒక ప్లాటు మార్టిగేజ్ విషయంలో విక్రయాలు చూస్తున్న అడ్వకేట్ హర్షిద్ హుస్సేన్ స్థానిక డాక్యుమెంట్ రైటర్ గణేష్‌ను సంప్రదించి దస్తావేజులు తయారు చేసి ఫైల్‌ను సబ్ రిజిస్ట్రార్ సంగీత ముందు పెట్టారు. రూ.30వేల డిమాండ్ చేయడంతో బుధవారం రూ.25 వేలు ముట్టచెప్పగా మరో ఐదు వేల రూపాయలు ఇవ్వనిదే పని జరగదని మొండికేయడంతో అవినీతి నిరోధకశాఖ అధికారులను హర్షిద్ హుస్సేన్ ఆశ్రయించాడు. హర్షిద్ ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణతో పాటు అవినీతి నిరోధక అధికారులు గురువారం వలపన్ని డాక్యుమెంట్ రైటర్ గణేష్‌తోపాటు సబ్ రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీతను పట్టుకుని అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.