క్రైమ్/లీగల్

మరాఠాల కోటాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: మరాఠాలకు విద్య, ఉపాధిలో ప్రత్యేక కోటా కల్పించడాన్ని బాంబే హైకోర్టు గురువారం సమర్ధించింది. అయితే 16 శాతంగా పెంచిన కోటాను 12 లేదా 13కు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతీ డాంగ్రేతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మరాఠా రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది. మరాఠాలకు కల్పించిన 16 శాతం ప్రత్యేక కోటాను రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా తగ్గించాలని దేవేందర్ ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యలో 12 శాతం, ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించాలని బీసీ కమిషన్ ప్రతిపాదన చేసింది. మరాఠాలకు రిజర్వేషన్ల కల్పనను తప్పుపట్టలేమని, అయితే కోటా తగ్గించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని 324(ఏ) ఆర్టికల్ సవరణపై ప్రభావం చూపకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఆర్టికల్ 342(ఏ)లోని 102 సవరణ కింద ఏదైనా ప్రత్యేక వర్గానికి కోటా అమలుచేయాలనుకున్న పక్షంలో రాష్టప్రతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్టప్రతి ఆమోదం తరువాతే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసిందని, కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకే కోటా చెల్లుబాటుకాదని పిటిషనర్ వాదించారు. సమాజంలోని పరిస్థితులను అధ్యయనం చేసిన బీసీ కమిషన్ కొన్ని కొలమానాలను పరిగణలోకి తీసుకుని నివేదిక అందించిందని కోర్టు వెల్లడించింది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీం కోర్టు విధించిన పరిమితికి మంచి కోటా కల్పించాల్సి ఉంటుందన్న బాంబే హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. అయినా బీసీ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని మరాఠా కోటా తగ్గించాలని న్యాయమూర్తులు సూచించారు. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ ‘పీజీ మెడికల్ కోర్సుల్లో 16 శాతం కోటా విధానం ఇప్పటికే అమలు చేశాం’అని తెలిపింది. ఈ సంవత్సరానికి 16 శాతం కోటాకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తరఫున వీకే తోరట్ కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర సర్కార్‌ను బెంచ్ ఆదేశించింది. విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏడాది ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 నవంబర్ 30న దీనికి సంబంధించి బిల్లుకు మహారాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది.