క్రైమ్/లీగల్

ప్రేమ తిరస్కరించిందని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, జూన్ 27: సినిమాల ప్రభావమో, సీరియళ్లను చూసో ప్రభావితమయ్యాడో తెలియదు కానీ టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక బాలుడు తనను ప్రేమించాలంటూ ఒక యువతిని వేధించాడు.. అయతే ఆమె పట్టించుకోకపోవడంతో బెదిరించడానికి సినీఫక్కీలో ఆమె ముందే ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే చెల్పూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గడ్డం జశ్వంత్ గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన సహచర విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో సదరు విద్యార్థినిని ప్రేమించాలని జశ్వంత్ అడుగగా ఆమె తిరస్కరించడంతో పాఠశాల ప్రాంగణంలోనే తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందును తిన్నాడు. ఈ విషయం తోటి విద్యార్థులు గమనించి పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా వెంటనే జశ్వంత్‌ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. వెంటనే ఈ సంఘటన విషయమై జశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఆస్పత్రి వద్దకు వచ్చి ఎలుకల మందు తిన్న తన కుమారుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పాఠశాల ప్రాంగణంలో ఈ సంఘటన జరగడం, జశ్వంత్ జేబులో ప్రేమలేఖలు దొరకడం మండలంలో సంచలనం రేపింది. ఈ సంఘటనపై ఇరు కుటుంబాలు ఎవరూ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం జశ్వంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. సదరు బాలిక జశ్వంత్‌ను ప్రేమించలేదని, కేవలం జశ్వంత్ మాత్రమే అమ్మాయి వెంట పడేవాడని సహచర విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఎలుకల మందు తాగిన జశ్వంత్ (ఫైల్‌ఫోటో)