క్రైమ్/లీగల్

చెల్లెలి ప్రేమ వివాహం..పెళ్లి కాదేమోనని అక్కల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల రూరల్, జూన్ 27: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇక తమకు పెళ్లి కాదేమోననే బెంగతో నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని చర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటయ్య, మాసమ్మ దంపతులకు ఆరుగురు కూతుళ్లు ఉండగా ఆర్థిక స్థోమత కారణంగా వారిలో ఒక్కరికి కూడా ఆ దంపతులు వివాహం చేయలేకపోయారు. దీంతో చిన్న కూతురు అయిన జ్యోతి ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది. తన కూతురు కనిపించకపోవడంతో ఆమెను వెతకడానికి తండ్రి వెంకటయ్య హైదరాబాద్‌కు వెళ్లాడు. తమ చెల్లి ప్రేమ వివాహం చేసుకున్నందున భవిష్యత్తులో తమకు పెళ్లి కాదేమోనన్న బెంగతో ఆమె పెద్దక్క మానస, రెండవ అక్క సునీత, మూడవ అక్క కృష్ణవేణి, నాలుగో అక్క యాదమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు యువతుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చర్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.